లక్కిరెడ్డిపల్లెలోని ఈద్గా ప్రహరీ గోడ నిర్మాణాలకు రూ. 15 లక్షలు, ముస్లిం స్మశాన వాటికకు ప్రహారీ గోడ నిర్మాణాలకు రూ 5 లక్షల నిధులను ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషితో ఎంపి ల్యాడ్స్ నిధులు మంజూరు అయ్యాయి. రూ 5 లక్షల నిధులతో ముస్లిం స్మశాన వాటిక పనులకు గురువారం భూమి పూజలను ఎంపిపి మద్దిరేవుల సుదర్శన రెడ్డి, మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య లతో కలసి శ్రీకాంత్ రెడ్డి నిర్వహించారు. పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.
ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ అమీర్, ఎంపిటిసి దస్తగిరి, ఉప సర్పంచ్ రాజారెడ్డి, మసీదు కమిటీ ముతావలీ, సయ్యద్ ఖళీళ్, ఛాన్ బాష, ప్రభుత్వ సర్కార్జి ముక్తార్ అహమ్మద్, సయ్యద్ ఏజదానీ బాష, నాసిర్ అహమ్మద్, జాకీర్, ఖాజా , నబీ, బాబ్జి, అబ్దుల్ జబ్బార్, అన్వర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa