ఆగిరిపల్లి;లక్ష్య సాంకేతిక, సాంస్కృతిక భాగంగా నిర్వహించిన నిపుణ ఎక్సోలో ఎన్టీఆర్ ఈసీఈ విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యార్థులు కారపు అజయ్, సింహాద్రి సుభాష్ గౌడ్, షేక్ నాగుల్ మీరా, సుందర్ ను ప్రకాష్. ఈనెల 28న లక్కిరెడ్డి బాలిరెడ్డి కళాశాల్లో జరిగిన లక్ష్మ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవంలో నిపుణ ప్రాజెక్ట్ ఎక్సె ప్రధమ స్థానంలో నిలిచారు. ఫార్మర్ అసిస్టెంట్ గా పిలవబడే వారి సాంకేతిక పరికరం ద్వారా నిపుణ విభాగంలో ప్రధమ స్థానం సాధించారు. ఈ విషయానికి స్పందించిన ఎస్ఆర్ఎస్ఐ కళాశాల చైర్మన్ డాక్టర్ రావి వెంకట రావు విద్యార్థులు ప్రతిభను ప్రశంసిస్తూ, మరిన్ని సాంకేతిక ఉత్సవాలలో విజయం సాధించాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. నాగభాస్కర్, కళాశాల ప్రాంగణ ఎంపిక అధికారి డాక్టర్ ఎన్వి సురేంద్రబాబు, ఈసిఈ డిపార్ట్మెంట్, హెచ్ఎడి డాక్టర్ ఆర్, సునీత, ఈసీఈ డీన్ డాక్టర్ పి. రామకోటేశ్వర రావు తదితరులు విద్యార్థులను అభినందించారు.