చిత్తూర్ జిల్లా,రామకుప్పం, శాంతిపురం మండల పరిధిలో ఐదో తరగతి చదివే బాలికపై గ్రామ వలంటీరు శివయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే..... . నిచ్చెన కోసమని ఓ ఇంటికి వలంటీర్ వెళ్లాడు. ఆ ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆలోపు బాలిక ఎక్కడకు వెళ్లిందని కుటుంబ సభ్యులు ఆరా తీస్తుండటం గమనించి వదిలేశాడు. ఇంటికి వచ్చిన బాలిక.. లైంగిక వేధింపుల విషయమై తల్లిదండ్రులకు చెప్పింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద వలంటీర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాలికను చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు.మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ శాంతిపురం మండల అధ్యక్షుడు విశ్వనాథనాయుడు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.