చైనాలో కరోనా కొత్త వేరియంట్లు విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. చైనా నుంచి వచ్చే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి నిబంధన తీసుకొచ్చాయి. ఈ నిర్ణయాన్ని చైనా తప్పుబట్టింది. తమ దేశం నుంచి వచ్చినవారికే పరీక్షలు నిర్వహించడం వివక్షపూరితమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే మూడేళ్లపాటు కఠిన కరోనా ఆంక్షలు అమలు చేసి, విదేశాల నుంచి వెళ్లేవారు కచ్చితంగా క్వారంటైన్లో ఉంచాలన్న నిబంధనలు పెట్టిన చైనా ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.