ఏపీలోని విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూఇయర్ వేడుకల్లో కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు. ఒకే చోట ఐదుగురికి మించి గుమికూడకూడదని, రోడ్లపై కేక్ కట్టింగ్స్ కు అనుమతి లేదని తెలిపారు. పబ్, రెస్టారెంట్ పార్టీలకు అనుమతి తప్పనిసరి అని, రోడ్లపై భారీ శబ్దాలతో డీజేలకు అనుమతి లేదని తెలిపారు.