కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను పెంచింది. 2023 జనవరి- మార్చి కాలానికి నూతన రేట్లు అమలు కానున్నాయి. ఆర్బీఐ ఈ ఏడాది 2.25 శాతం మేర రెపోరేటును పెంచిన విషయం తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లను సవరించింది. తాజా పెంపుతో కొన్ని పథకాలు ఆకర్షణీయంగా మారాయి. జీవిత లక్ష్యాలకు ఉపకరించే, దీర్ఘకాలంతో కూడిన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై రేట్లు పెరగలేదు. అలాగే సేవింగ్స్ డిపాజిట్, ఐదేళ్ల టైమ్ డిపాజిట్ రేట్లలోనూ ఎలాంటి మార్పులు చేయలేదు.