ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ లను సమపాళ్లలో తీసుకొని జ్యూస్ చేసుకొని ప్రతిరోజూ ఒక గ్లాసు ఉదయాన్నే తాగాలి. ఆపిల్ లో ఎక్కువగా ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులు, కొన్నిరకాల క్యాన్సర్లను దరిచేరనీయవు. బీట్‌రూట్ డీటాక్సిఫై చేసి శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తాయి. క్యారెట్ లో కెరొటినాయిడ్స్, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లూ, మినరల్స్ శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తాయి. ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. శరీరంలోని మలినాలను బయటికి పంపిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. వీటిలో కెలోరీలూ తక్కువగా ఉంటాయి. అయితే రోజంతా వీటిపైనే పూర్తిగా ఆధారపడకుండా, తక్కువ కార్బొహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రొటీన్ ఉండే బ్యాలెన్స్‌డ్ డైట్‌నీ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.