బెల్లంకొండ మండలంలోని, పాపాయిపాలెం గ్రామ పరిసర ప్రాంతాలలో యదేచ్చగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తూ, బ్లాస్టింగ్ నిర్వహించినప్పుడు భయభ్రాంతులకు గురి అవుతున్నామని గ్రామస్తులు శనివారం తెలిపారు. మండల స్థాయి అధికారులు పట్టించుకోవడంలేదని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.