దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యారంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్ కెఎన్ఆర్ హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు శుక్రవారం ట్యాబ్ లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు
విద్యార్థులకు అమ్మఒడి, గోరుముద్ద, వసతి దీవన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ట్యాబ్ లను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగర మేయర్ పొట్లూరి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.