ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు సెంటర్ లో శుక్రవారం దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. జిల్లా సీఎం జగన్ దళితులకు స్మశానానికి స్థలం కేటాయించిన సందర్భంగా సీఎం జగన్ కు దళిత సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాన కార్యదర్శి దయాకర్ మాదిగ, జిల్లా అధికార ప్రతినిధి కూరపాటి రంగయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.