పచ్చి బఠాణీల్లో ఉండే ఐరన్ వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఇందులోని విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. బఠాణీల్లో ఉండే లుటీన్ అనే కెరోటినాయిడ్ కళ్లలో శుక్లాలు రాకుండా చూస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. బఠాణీల్లోని ఫైబర్ గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. వీటి వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీంతో బరువు కూడా తగ్గొచ్చు. మలబద్ధకం సమస్య పోతుంది.