సెలవులో ఉన్న ఉద్యోగిని ఆఫీస్‌లో ఉన్నవారు పని పేరుతో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు తాజాగా డ్రీమ్ 11కంపెనీ ‘డ్రీమ్11 అన్‌ప్లగ్’ పేరుతో కొత్త పాలసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా సెలవులో ఉన్న ఉద్యోగులకు ఆఫీస్‌కు సంబంధించిన ఎలాంటి పని కేటాయించకూడదు. ఒకవేళ పనికి సంబంధించి ఫోన్, మెసేజ్, ఈ-మెయిల్ చేసినా, బాస్‌తోపాటు, ఫోన్ చేసిన ఉద్యోగికి కంపెనీ జరిమానా విధిస్తుంది. ఈ పాలసీ ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగికి ఆఫీస్ పని కోసం ఫోన్ చేసిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధించనుంది.