షిర్డీ సాయిని దర్శించుకునేందుకు బయల్దేరిన భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పశ్చిమ భాండూప్ టెంభిపాడ తానాజీవాడ చాల్ లోని మనోజ్ జోషి(36), మాన్సీ జోషి(34) దంపతులు అదే ప్రాంతంలోని మరికొందరితో కలిసి నూతన సంవత్సరం నాడు షిర్డీ సాయిని దర్శించుకోవాలని షిర్డీకి బయల్దేరారు. కొన్ని కుటుంబాలు మినీ బస్సులో బయల్దేరగా, జోషి దంపతులతో పాటు మరికొందరు బైకులకు బయల్దేరారు. భీవండీ తాలుకా యెవైనాకు చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ కంటెయినర్ జోషి దంపతులను వెనకనుండి ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. వారి మూడేళ్ల కూతురు మన్మాయి గాయాలతో బయటపడింది.