టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ పై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మకూరు మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ ఇటీవల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్ తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్ పై 153ఏ, 505 కింద కేసు నమోదు చేశారు.