ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి యువకుడు ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 11:55 AM

ప్రేయసి పెళ్లికి నిరాకరించడంతో యువకుడు ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన అస్సాంలో సోమవారం జరిగింది. అయితే దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అస్సాంలోని కలాయిన్ కు చెందిన జయదీప్ మెడికల్ సేల్స్ ప్రొఫెషనల్ గా పని చేస్తూ సిల్చార్ లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అదే గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య సమయంలో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి 'ఆమెను ఎంతగానో ప్రేమించాను, పెళ్లిచేసుకుందామని ప్రపోజ్ చేస్తే అందరి ముందు తిరస్కరించింది ఆ తర్వాత వాళ్ల అంకుల్ వచ్చి రిలేషన్ కొనసాగిస్తే ఆమెను చంపేస్తానిన బెదిరించాడు. నా వల్ల ఆమె బాధపడకూడదు. అందుకే చనిపోతున్నా. అమ్మా నన్ను క్షమించు. నా ప్రేయసి లేకుండా నేను బతకలేను. అందుకే ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నా' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com