ఆధార్‌కార్డు గురించి కేంద్రం కీలక సూచనలు చేసింది. ఆధార్‌కార్డు, వాటి కాపీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయొద్దని ప్రజలకు సూచించింది. ఆధార్ నెంబర్‌ను సోషల్‌మీడియా, ఇతర బహిరంగ వేదికల్లో ఉంచవద్దని పేర్కొంది. ఆధార్‌నెంబర్‌ను ఇతరులతో పంచుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఓటీపీని ఎవ్వరితో పంచుకోవద్దని పేర్కొంది. ప్రతి ఆధార్‌కార్డుదారు తన ఈమెయిల్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఆధార్‌కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను 24 గంటల్లో ఎప్పుడైనా సంప్రదించవచ్చని కేంద్రం సూచించింది.