క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లో శుక్రవారం ఉదయం ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఇక పంత్ బ్రెయిన్, వెన్నుముక నార్మల్‌గా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ముఖంపై తగిలిన దెబ్బలకు, వెన్నులో చర్మం కొట్టుకుపోయిన దగ్గర పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు ఓ రిపోర్ట్‌లో తేలింది.