దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ బడుగు, బలహీన, ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న మేలును వాలంటీర్ల సహకారంతో పార్టీ సచివాలయాల కన్వీనర్లు, గృహసారథులు ప్రతి గడపకూ తీసుకెళ్లాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి శుక్రవారం పిలుపునిచ్చారు. రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ప్రజల చెంతకు నేరుగా ప్రభుత్వాన్ని తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివద్ధికి బాటలు వేశారు. ప్రజల కోసం జగనన్న ఏం చేస్తున్నాడు, మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడనే విషయాలను సచివాలయాల కన్వీనర్లు, గహసారథులు ప్రజలకు తెలియజేయాలి. మన ప్రభుత్వం ఏమి చెప్పిందో అది చేసింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు చెప్పిందేదీ చేయలేదు. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ తెలియజేయాలి. వలంటీర్ల సహకారం తీసుకుని ఇంటింటికీ వెళ్లాలి. అందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ చేయని మేలును మన రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంతి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రతిపక్ష టిడిపి కుట్రలు చేస్తోంది. ఎలాగైనా తప్పుడు మాటలు, మాయమాటలు చెప్పి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది. గత ఐదేళ్లలో ఫలానా మంచి పనిని చేశామని ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునేందుకు లేని వారు. మరోమారు అధికారంలోకి వస్తే అదిచేస్తాం, ఇది చేస్తామని చెబుతున్నారు. వారి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు అన్నారు.