భవిష్యత్తును అన్ని విధాలా చిదిమివేసే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని పర్చూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ యశోధరాదేవి ఉద్బోధించారు. బాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు ఆమె మార్టూరు గ్రామంలోని డిగ్రీ కళాశాలలో శుక్రవారం మాదకద్రవ్యాలపై అవగాహనా సదస్సును నిర్వహించారు. మాదక ద్రవ్యాలను సేవిస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని ఒకవేళ ఆ కేసుల్లో చిక్కుకున్న పక్షంలో ఇక భవిష్యత్తు ఉండదని సిఐ హెచ్చరించారు. ఎవరైనా కళాశాల సమీపంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను గనుక విక్రయిస్తుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.