నూతన సంవత్సర వేళ హర్యానాని భూకంపం వణికించింది. ప్రజలందరూ న్యూయర్ సెలబ్రెషన్స్లో మునిగితేలుతుండగా అర్ధరాత్రి 1.19కి హర్యానాలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 3.8గా నమోదైంది. ఐతే ప్రకంపనల తీవ్రత ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాలకూ వ్యాపించాయి. హర్యానాలోని ఝజ్జార్ ప్రాంతంలో భూ ఉపరితలానికి 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.