అరటి పండును భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. ఏ సీజన్‌లో అయినా మనకు లభించే పండ్లు ఇవి. నిత్యం అల్పాహారంలో ఒక అరటి పండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇందులోని ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు సాయపడతాయి. అరటి పండులో ఫైబర్ అధికంగా ఉండడంతో మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు. హైబీపీని నియంత్రించడంలో దీనిలోని పొటాషియం దోహదపడుతుంది.