టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇటీవల వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఓపెనింగ్ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని డిమాండ్ పెరుగుతుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. వన్డేల్లో రోహిత్, ఇషాన్ ఓపెనింగ్ చేయాలని అభిప్రాయపడ్డాడు. 'ఓపెనర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం ఇషాన్ కిషన్ సరైనవాడు. బంగ్లాతో వన్డేలో అతను 35వ ఓవర్లోనే డబుల్ సెంచరీ చేశాడు. ఇషాన్ చాలాసేపు బ్యాటింగ్ చేయగలడు. ఆ తర్వాత స్థానాల్లో కోహ్లి, సూర్య, శ్రేయస్, హార్దిక్ ఉంటారు. రాహుల్ బ్యాకప్ బ్యాచర్, కీపర్ గా ఉంటాడు' అని గంభీర్ పేర్కొన్నాడు.