ప్రతి రోజూ కనీసం ఒక గుడ్డు అయినా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో ఉడికించిన గుడ్లు తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతున్నారు. గుడ్లలో ఉండే ఐరన్ వల్ల అలసట తగ్గడం సహా మనస్సును చురుకుగా ఉంచుతుందని పేర్కొంటున్నారు. గుడ్డులోని కొవ్వు ఆమ్లాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. సో.. రోజూ ఓ ఉడికించిన గుడ్డు తింటూ ఆరోగ్యంగా ఉండండి.