చీమకుర్తిలో ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రాం గణంలో గత ఇరవైఏళ్లుగా పూజలు జరుగుతున్న షిర్డీసాయి మందిరాన్ని ఆదివారం ధ్వంసం చేశారు. మందిరంలో ఉన్న సాయి, వినాయక, అమ్మవారి ప్రతిమలను తొలగించారు. దీంతో కళా శాల ప్రిన్సిపాల్ వీవీ.శివారెడ్డి పోలీస్స్టే షన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు మేరకు.. ద్వారకామయి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాలను చీమకుర్తిలోని రె డ్డిబజారులో వీవీ.శివారెడ్డి 2000సంవత్సవరంలో ఏర్పాటు చేశారు.
ఈ కళాశాలను పట్టణానికి చెందిన సుధాకరరెడ్డికి చెందిన స్థలంలో లీజుకు తీసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. 2004లో కళాశాలకు ముందు లీజుస్థలంలో సాయిమందిరాన్ని ఏర్పాటు చే యగా అప్పటి నుంచి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే కాలానుగుణంగా లీజును రెన్యువల్ చేసుకుంటుండగా తాజాగా 2020లో చేసుకున్న రెన్యువల్ ప్రకా రం గడువు 2030వరకూ ఉంది. కాగా ఆదివారం లీజుకు ఇచ్చిన స్థలం యజమాని సుధాకరరెడ్డి మందిరాన్ని ధ్వంసం చేసినట్లు ప్రిన్సిపాల్ శివారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కృష్ణయ్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.