ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా వలంటీర్ల వ్యవస్ధను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని పలు డివిజన్లలో ఆదివారం నిరసన తెలిపారు. శాసన మండలి సమావేశాల్లో వలంటీర్ వ్యవస్థ ఇకలేదని సాంఘిక, సంక్షేమ మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి ప్రకటించడం సిగ్గుచేట న్నారు. వలంటీర్లకు ఉద్యోగభద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా అందాల్సిన జీతాలను చెల్లించి, వలంటీర్ల సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నేతలు మమత, రాజ్‌కుమార్, రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు.