ఆపదలో ఆదుకునే మానవతావాది సీఎం చంద్రబాబునాయుడని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం టి.నాయుడుపాలెంలోని తన స్వగృహంలో నియోజకవర్గంలోని కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు మండలాలతోపాటు కందుకూరు, అద్దంకి మండలాలకు చెందిన 30 మంది బాధితుల కు రూ.38,78,482 విలువైన చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2014-19 మధ్యకాలంలో కూడా నియోజకవర్గంలోని వందలాది మందికి సీఎంఆర్ఎఫ్ సాయం చంద్రబాబు అందించారని గుర్తు చేసుకున్నారు. అనారోగ్యాని కి గురైన పేదలను ఆదుకోవడంలో చంద్రబాబు ముందుంటారన్నారు. బాధితులు సీఎం చంద్రబాబుకు, మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో కొండపి ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, పెదకండ్లగుంట మాజీ సర్పంచ్ తానికొండ వెంకటేశ్వర్లు ఆయా మండలాల్లోని నాయకులు పాల్గొన్నారు.