బాపట్ల జిల్లా చీరాల మండలం దేవాంగ పురి గ్రామ పంచాయతీ పరిధిలోనీ శ్రీ స్వామి వివేకానంద అసోసియేషన్ అఫ్ ఫ్రెండ్స్ కన్వీనర్ బట్ట రవి వర్మ ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర క్యాలెండరును ఆదివారం ఆవిష్కరణను చీరాల మండల అభివృద్ధి అధికారి కె. నేతాజీ ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వివేకానంద ట్రస్ట్ ద్వారా వివిధ సామజిక సేవ కార్యక్రమాలు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి నాసిక శివాజీ, దేవాంగపురి పంచాయతీ కార్యదర్శి బండారు మురళీ, బాపూజీ, బాపట్ల బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు మువ్వల వెంకటరమణ రావు, చీరాల అసెంబ్లీ బాద్యులు అర్వపల్లి కుమార్, చీరాల బీజేవైఎం అధ్యక్షులు బక్కా మనోహర్ రెడ్డి, బీజేపీ సభ్యులు గోపాల కృష్ణ, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.