రామాయపట్నం బీచ్ వద్ద ఆదివారం సెలవుదినం కావడంతో పర్యాటకుల సందడి కనిపించింది. ఆదివారం కార్యాలయాలకు విద్యార్థులకు సెలవులు మరియు నూతన సంవత్సరం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత కుటుంబ సమేత రామాయపట్నం బీచ్‌కు చేరుకుని సందడి చేశారు. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదిస్తూ, బీచులో చిన్నా, పెద్ద తేడా లేకుండా సరదాగా గడిపారు. సందర్శకుల సందడి నెలకొనడంతో మెరైన్ పోలీసులు బందోబస్తు చేపట్టారు.