సండే స్కూల్ విద్యార్థులు బాల్య దశ నుండే ప్రేమ, క్షమ గుణాలను అలవర్చుకోవాలని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ మేడికొండ సూరిబాబు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం చినగంజాం అంబేద్కర్ నగర్ లో 60 మంది సండే స్కూల్ విద్యార్థులకు సూరిబాబు తో పాటు బాపట్ల సూర్యలంక సెంట్రల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ బొలిమెర నాగేశ్వరరావు, రైల్వే ఉద్యోగి చప్పిడి చక్రపాణి, ఆయన సతీమణి శివకుమారి, నిర్వాహకుడు మేకల మేషక్ బాబు, ఆయన సతీమణి శాంతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.