కడప నగరం 48 డివిజన్ కృపా కాలనీలో 2023 క్రొత్త సంవత్సరం పురస్కరించుకుని ఆదివారం న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ క్రీస్తు చర్చిలో పాస్టర్ పి. మహేష్, సిస్టర్ శాంతమ్మ గార్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చిన భక్తులందరితో ప్రజల ఆయురారోగ్యం కొరకు ప్రార్థనలు చేపించి వాక్య సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర కేక్ కట్ చేసి, చిన్నారులకు మాస్కులు, సబ్బులు, పండ్లు పంపిణీ చేసి, పేదలకు అన్నదానం చేశారు. పాస్టర్ పి. మహేష్ మాట్లాడుతూ యువతి యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లి దండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించే వారుగా ఆధ్యాత్మికంగా క్రీస్తుపై విశ్వాసంతో ఎదగాలని కోరారు. అదే విధంగా ఈ విపత్తు దినాలలో వైరస్ ముప్పు నుంచి కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ బట్ట మాస్కు ధరించి వైరస్ నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ నూతన సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురవాలని, దేశానికి వెన్నెముక అయిన రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సుఖశాంతులతో యేసు క్రీస్తు ఆశీస్సులు అందరికీ అందాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బుడగజంగం జిల్లా అధ్యక్షులు దూపం రాజు, విశ్వాసులు పి. రవితేజ, శాంతిరాజు, రోజా, అగస్టిన్, చిరంజీవి, నరసయ్య, చందు, దావీదు, లీలావతి, సరళ, సుగుణమ్మ అనేకమంది భక్తులు పాల్గొని కృపా కాలనీలో ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిఠాయిలు పంచుకొని, సంతోషకరంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.