అవ్వా తాతల ఆనందమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటి రూరల్ మండలానికి మంజూరైన నూతన పెన్షన్ల పంపిణీ లో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపిడిఓ మల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్ష పార్టీ అని అన్నారు. ఏ ఒక్క పెన్షన్ తొలగించ కుండా కొత్త పెన్షన్ల ను మంజూరు చేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని నిరూపించారన్నారు. నూతన సంవత్సరం రోజు పెన్షన్ దారులలో ఆభద్రత భావం నెలకొల్పాలని ప్రతిపక్షం కుట్రపన్నిందన్నారు. కానీ ఇది పేదల ప్రభుత్వం కాబట్టి పాత పెన్షన్ తొలగించకుండా కొత్త పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. పెన్షన్ విషయంలో మాట్లాడే అర్హత ప్రతిపక్షానికి లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒకరు చవిపోతే కానీ మరోకరికి పెన్షన్ ఇచ్చేవారు కాదన్నారు. మహనేత వైఎస్ఆర్ సాచురేషన్ పద్ధతిలో అర్హులైన వారందరి పెన్షన్లు మంజూరు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతు పోతున్నారన్నారు.