దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని ఫ్లాట్గా ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 55 పాయింట్ల నష్టంతో 60,785 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 18,090 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.60 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా స్టీల్, టాటా మోటార్స్, ICICI బ్యాంక్, NTPC, భారతీ ఎయిర్టెల్, SBI, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.