ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆరో వార్డులో నూతనంగా పెంచిన పెన్షన్ డబ్బులను ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాసులు మున్సిపల్ కౌన్సిలర్లు సచివాల సిబ్బంది, మున్సిపల్ అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.