ఈ చలి కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం. దీనికి గుడ్లు చాలా సహకరిస్తాయి. రోజుకు రెండు గుడ్లు ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువ గుడ్లు తినడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. అధిక విరేచనాలతో శరీరం బలహీనంగా మారిపోయి.. అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. మీ జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతినవచ్చు. కాబట్టి రోజుకు రెండు గుడ్లు శరీరానికి, ఆరోగ్యానికి మంచిది.