ట్విట్టర్ ఇండియాలో భారీగా అకౌంట్లను సస్పెండ్ చేసింది. న్యూడిటీ, పిల్లల లైంగిక దోపిడీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయంటూ 48,624 ట్విట్టర్ ఖాతాలపై యాజమాన్యం వేటు వేసింది. ఈ అకౌంట్లు అక్టోబర్ 26 నుండి నవంబర్ 25 మధ్య కాలంలో ట్విట్టర్ నియమాలను ఉల్లంఘించినట్లు తెలిపింది. వినియోగదారుల నుండి 755 ఫిర్యాదులు అందాయని, దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది.