శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ మండలం, గుట్టూరు గ్రామం నందు నూతనంగా నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం కు సోమవారం పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గుట్టూరు గ్రామం నందు ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర పెంచిన పెన్షన్ కానుక రూ. 2, 750 లను, నూతన పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఎంపీపీ, జెడ్ పి టి సి, ఎంపీటీసీలు , సర్పంచులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్యనాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ లు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.