శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను సోమందేపల్లి గ్రామానికి చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు షాది మహల్, కబురుస్తాన్, బరేల్ గ్రౌండ్ కోసం కలవడం జరిగింది. ఈ సందర్బంగా ముస్లిం సోదరుల సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎమ్మెల్యే శంకర్ నారాయణ సానుకూలంగా స్పందించి మీ సమస్యలకు తొందరలోనే పరిష్కార మార్గం చూపుతానని హామీ ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించినందుకు ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, జెడ్పిటిసి డిసి అశోక్, ఉపసర్పంచ్ వేణుగోపాల్, వైయస్సార్సీపి మండల మైనార్టీ కన్వీనర్ షేక్ ఇమామ్ వలి, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.