ధనుర్మాసం ఏకాదశిన మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మండల పరిధిలోని శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం ఆలయంలో ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులకు తగిన ఏర్పాట్లను ఆలయ ప్రధాన సేవకులు, పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కాశీ బట్ల సత్య సాయినాథ్ శర్మ ఏర్పాటు చేశారు.