బద్వేల్ పట్టణంలోని లక్ష్మీ పాలెం గ్రామంలో కొలువు తీరి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ మరియు నెల్లూరు రోడ్ లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లను గావించారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఆలయ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా చర్యలు చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.