అయ్యప్ప స్వామి, దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్రంకు చెందిన బైరీ నగేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ చేతన్య వేదిక ఆధ్వర్యంలో కడప నగరంలో ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కడప తహశీల్దార్ శివరామి రెడ్డి, వన్ టౌన్ ఎస్సై నారాయణకు వినతిపత్రంను హిందూ చేతన్య వేదిక ఆధ్వర్యంలో అందజేశారు. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.