ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రద్దీని క్రమబద్ధీకరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 02, 2023, 05:04 PM

గుంటూరు దుర్ఘటనకు జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు మృతుల కుటుంబాలకు సాయం ప్రకటించకుండా, టీడీపీపై నిందలేస్తూ తప్పుడు ప్రచారానికి ఆగమేఘాలపై బయలుదేరారని మండిపడ్డారు. పోలీసుల అనుమతితో సంక్రాంతి కానుకల పంపిణీ చేపట్టగా.. వేలాది మంది అక్కడకు చేరుతుంటే.. తగిన బందోబస్తు ఏర్పాటు చేసి, రద్దీని క్రమబద్ధీకరించడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. కానుకల పంపిణీలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందడం బాధాకరమని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ పేర్కొన్నారు. మృతిచెందిన వారికి సంతాపం ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com