ప్రభుత్వం ఉద్యోగుల హాజరు కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరు(పేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్) ఉత్తర్వులు నేటినుంచి అమల్లోకి రానున్నాయి. మొదటగా ఏపీ సచివాలయం, విభాగాధిపతి కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఈ నెల 1నుంచి అటెండెన్స్‌ను ఈ విధానంలో అమలు చేయనున్నారు. మిగిలిన అటానమస్ సంస్థలు, అన్ని ప్రాంతీయ డివిజనల్ సంస్థలు, స్థానికసంస్థలు, గ్రామ స్థాయి కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ముఖ ఆధారిత హాజరును 16నుంచి అమలు చేయనున్నారు. ఈలోపు ఆయా ఉద్యోగులకు యాప్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ ఫేస్ స్కాన్ చేయడం ద్వారా అటెండెన్స్ గుర్తిస్తారు. అయితే ఇప్పటికే పలు కార్యాలయాల్లో అధికారులకు ఇచ్చిన యాప్ సరిగా పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.