ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. గుంటూరు, కందుకూరు ఘటనలతో ప్రజల భద్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ, కేంద్ర, మున్సిపల్, పంచాయతీ రాజ్ రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు లేదా సీపీలు కచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వొచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.