ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక కవి, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కల నాసరయ్య మంగళవారం సావిత్రి బాయి పూలే 192 వ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ సమాజంలో మహిళా విద్య పట్ల వ్యతిరేకత ఉన్న కాలంలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగిన గొప్ప మహిళ సావిత్రి బాయి పూలే, ఆమె జయంతిని నేడు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము, ఈమె గొప్ప సంఘసంస్కర్త, హరిజన విద్యకు కృషి చేసిన జ్యోతిరావు పూలే యొక్క సతీమణి, భర్తనే ఆదర్శంగా తీసుకోని మహిళలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు కల్పించడానికి కృషి చేశారు. పూనా లో తన భర్త స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించడంలో ఈమె కృషి ఎంతో గొప్పది, ఈమె కృషి కేవలం స్త్రీ విద్యకే పరిమితం కాలేదు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యాధి గ్రస్తులకు సేవ చేసిన గొప్ప త్యాగ మూర్తి, భయంకరమైన ప్లేగు వ్యాధితో భాధపడుతున్న వారికి సేవ చేస్తూనే మరణింంచింది, సావిత్రి బాయి పూలే జీవితం సమాజసేవలో ప్రతీ ఒక్కరి భాద్యతను గుర్తు చేసే ఆదర్శ మహిళా అని కొనియాడారు. ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని నేటి మహిళలు ముందడుగు వేయాలని సూచించారు. అనంతరం సాహిత్య రంగంలో విశిష్ట సేవకు గానూ గొట్టిముక్కుల నాసరయ్యకు హైదరాబాద్ కు చెందిన వల్లూరి పౌండేషన్ సంస్థ చైర్మన్ వి. ఆర్. శ్రీనివాస్ రాజు సావిత్రి బాయి పూలే జీవిత కాల సాఫల్య పురస్కారంను అంతర్జాల మాధ్యమం ద్వారా అందచేశారు. ఈ సందర్భంగా నాసరయ్యను తమ గురువులు, ఉభయ రాష్ట్రాల కవి మిత్రులు, తల్లిదండ్రులు, బంధు మిత్రులు అభినందించారు.