ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంగళవారం కందుకూరు మండలం కోవూరు లో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి గడప గడపకు వెళ్ళి ప్రజలందరిని అప్యాయంగా పలకరిస్తూ, సంక్షేమ పథకాల అందుతున్న తీరును తెలుసుకున్నారు. ఎమైనా సమస్యలు వున్నాయా అని తెలుసుకుంటూ వాటిని అక్కడికి అక్కడే సంబందిత అధికారుల ద్వారా తక్షణమే పరిష్కారం చూపారు. మరికొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.