ఉత్తరాదిలో చలితీవ్రతకు ప్రజలు బెంబేతెత్తుతున్నారు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో యూపీ రాజధాని లక్నోలో జనవరి 4 నుంచి 7 వరకూ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవలు ప్రకటించామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో చలిగాలులు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa