వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని రెవెన్యూ రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే కాలనీలో రూ.1.09 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైయస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ ను రెవెన్యూశాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ...కొద్దీ రోజులు క్రితం శంకుస్థాపన చేసిన హెల్త్ సెంటర్ ఇవాళ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే సరైన వైద్యం అందదనే భావన రాష్ట్రంతో పాటు దేశం మొత్తమ్మీద ఉంది. అందుకే ఎక్కువ మంది ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తారు. కుటుంబానికి ఉన్న ఆదాయం వైద్యం కోసమే ఎక్కువ ఖర్చు చేస్తారు. పేద కుటుంబానికి అండగా ఉండాలి అంటే ప్రభుత్వాలు మంచి వైద్యం అందించాలి. అదే మన రాష్టంలో జరుగుతుంది. 900 బెడ్స్ మన ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకు వచ్చాము. అదేవిధంగా మందులు అందుబాటులో ఉంచాము. మంచి వైద్యులు ఉన్నారు అని తెలియజేసారు.