ఉత్తరాఖండ్ లోని జ్యోషీమఠ్ లో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. సుమారు 561 వరకూ ఇళ్లు భూమిలో కుచించుకుపోతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కాగడాలతో నిరసన చేపట్టారు. సింగ్ ధార్, మార్వాడి ప్రాంతాల్లో పగుళ్లు ఎక్కువగా వస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం 66 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు అధికారులు తెలిపారు.