ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కీళ్ల దగ్గర తగినంత జిగురు ఉండకపోవడం. ఈ సమస్య ఉన్నవారు ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువగా తింటే అది కీళ్ల సందులలో పేరుకుపోతుంది. దీంతో మోకాళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. అలాగే అధిక బరువు వల్ల కూడా మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు వస్తాయి. బరువు తగ్గడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.