తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. తిరుపతి- తిరుమల మధ్య రోప్ వే సాధ్యాసాధ్యాలపై త్వరలోనే అధ్యయనం ప్రారంభించనున్నారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థను ఆదేశించినట్లు ఎంపీ గురుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు 4 కి.మీ మేర ఈ రోప్ వేను నిర్మించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమైతే తిరుమలకు వచ్చే భక్తులకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది.